ఓటరు జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణలో భాగంగా పోలింగ్ కేంద్ర స్థాయిలో నిర్వహించే ఓటర్ల ప్రత్యేక శిబిరాన్ని రేపల్లె మండల ప్రజలు సద్వి నియోగం చేసుకోవాలని తహశీల్దారు మల్లికార్జున రావు కోరారు. శనివారం ఓటర్ల శిబిరాన్ని ఆయన పరిశీలించారు. ఓటరు జాబితాలకు సంబంధించిన సమాచారం ఓటర్ల ఇంటి ముంగిటకు తీసుకెళ్లే ప్రక్రియ అన్నారు. పోలింగ్ కేంద్రం అధికారి తమకు కేటాయించిన కేంద్రాల వద్ద అందుబాటులో ఉంటారన్నారు.