పడుకునే ముందు నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల తరచూ మూత్రవిసర్జనకు వెళ్లాల్సి వస్తుంది. దీని వల్ల నిద్రకు భంగం కలుగుతుంది. రాత్రిపూట నీళ్లు తాగే అలవాటున్న కొంతమందిలో గుండెల్లో మంట కలిగిన భావన రావచ్చు. శరీరంలోకి చేరిన అధిక నీరు జీర్ణక్రియకు ఇబ్బందులు తెచ్చి పెడతాయి. స్లీప్ ఆప్నియా సమస్య ఉన్నవారు ఎక్కువగా తీసుకునే నీళ్ల వల్ల శ్వాస మార్గాలు ఉబ్బరాన్ని కలిగించవచ్చు. ఫలితంగా నిద్రలో శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారుతుంది.