కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో సామాజిక సాధికార బస్సుయాత్ర జరుగనుంది. మధ్యాహ్నం రెండు గంటలకు కాకినాడ ఆర్ అండ్ బీ అతిథి గృహంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల మీడియా సమావేశం ఉంటుంది. మూడు గంటలకు బస్సు యాత్ర ప్రారంభం కానుంది. నాలుగు గంటలకు సర్పవరంలో భారీబహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభకు మంత్రులు బూడి ముత్యాల నాయుడు, తానేటి వనిత, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, పినిపే విశ్వరూప్, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, మిథున్‌రెడ్డి తదితరులు హాజరుకానున్నారు.