ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర, ప్రజల భవిష్యత్తు ప్రయాణాన్ని రచించుకునేందుకు వైయస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర మూలమైందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర నేటితో ఆరేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో కేక్‌కట్ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పార్టీ సీనియర్ నేత, శాసనమండలి చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. వైయస్ జగన్ 341 రోజుల పాటు పాదయాత్రలో నిర్విరామంగా నడిచి, సుమారు 2 కోట్ల మంది ప్రజానీకాన్ని కలిశారని చెప్పారు. పాదయాత్ర చేసేటప్పుడు ఎవరు ఆయనతో అడుగులు వేసినా, సమస్యలు చెప్పేందుకు ఎవరైనా వచ్చినా సరే 341 రోజులు ఎక్కడా విసుగు, విరామం లేకుండా వారిని కలిసి, వారి కన్నీళ్లు తుడిచి, కష్టాలు విని, భరోసా ఇచ్చారని గుర్తుచేశారు. 2 కోట్ల మంది ప్రజానీకాన్ని చిరునవ్వుతో కలిశారని చెప్పారు.