దొండకాయను సాధారణంగా కూరల్లో ఉపయోగిస్తారు. కానీ వీటితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. దొండకాయను తినడం వల్ల శరీరంలోని రోగ నిరోధక శక్తి పెరుగుతోంది. దీనివల్ల వ్యాధుల బారిన పడే ప్రమాదం తగ్గుతుంది. వీటిని తీసుకోవడం వలన జీర్ణవ్యవస్థ మెరుగై, ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. దొండకాయ తినడం వల్ల కండరాలు బలంగా తయారవుతాయని ఒక అధ్యయనంలో తేలింది. అంతే కాకుండా హైబీపీ సమస్య ఉన్నవాళ్లకు దొండకాయ ఉత్తమ ఔషధం అని నిపుణులు సూచిస్తున్నారు.