అధిక రక్తపోటు(హై బీపీ) ఉన్న వారికి గుండె జబ్బులకు గురయ్యే ప్రమాదం ఉంది. ఈ ముప్పును అరికట్టే ఆహార పదార్థాలను తీసుకోవాలి. గుమ్మడికాయ గింజలు అనేక పోషకాలను కలిగి ఉంటాయి. ఇందులో ఉండే మెగ్నీషియం, పొటాషియం, ఓమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. రక్త పోటును అదుపులో ఉండేలా చేస్తాయి. గుమ్మడికాయ గింజలు రొమ్ము, ప్రొస్టేట్ క్యాన్సర్ రాకుండా అడ్డుకుంటాయని అధ్యయనాలలో తేలింది.