ఏపీలో కరవు మండలాల ప్రకటనకు, పంటల బీమాకు ఎలాంటి సంబంధం లేదన్నారు సీఎం జగన్. ఇటీవల రాష్ట్రంలోని 103 మండలాలను మాత్రమే కరవు మండలాలుగా ప్రకటించడంపై రైతులు, ప్రతిపక్షాల నుంచి నిరసన వ్యక్తం కావడంతో సీఎం స్పందించారు. అర్హులైన రైతులందరికీ పంటల బీమా వర్తింపజేస్తామని.. రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన నాలుగేళ్లలో ఉచిత పంటల బీమా కింద రైతులకు రూ.7,800 కోట్ల పరిహారమిచ్చామని గుర్తు చేశారు.