జీ-మెయిల్ యూజర్లకు గూగుల్ భారీ షాక్ ఇచ్చింది. రెండేళ్ల నుంచి ఎలాంటి యాక్టివిటీ లేకుండా నిరుపయోగంగా ఉన్న ఖాతాలను తొలగిస్తున్నట్లు గూగుల్ వెల్లడించింది. వచ్చే నెల నుంచి దశలవారీగా ఈ ప్రక్రియ మొదలవుతుందని తాజాగా ప్రకటించింది. అయితే ఖాతాలను తొలగించే ముందు యూజర్లకు హెచ్చరికలు పంపుతామని గూగుల్ పేర్కొంది. జీ-మెయిల్‌కు అనుసంధానమైన డ్రైవ్, మీట్, గూగుల్ ఫోటోస్‌లోని కంటెంట్ సైతం తొలగించనున్నట్లు స్పష్టం చేసింది.