జీలకర్రతో ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలున్నాయి. జీలకర్ర మరిగించిన నీటిని తాగడం వల్ల అసిడిటీ, జీర్ణ సమస్యలు తగ్గుతాయి. జీలకర్రలో ఐరన్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి నానబెట్టిన నీటిని తాగడం వల్ల రోగనిరోధక శక్తి గణనీయంగా పెరుగుతుంది. మధుమేహంతో బాధపడే వారికి ఇది దివ్యౌషధంగా పని చేస్తోంది. చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. ఇక శ్వాసకోశ సమస్యలను పోగొడుతుంది. లివర్‌లోని ట్యాక్సిన్స్‌ను బయటకు పంపుతుంది.