తెల్ల నువ్వుల కంటే నల్ల నువ్వులలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే నువ్వులు పొడవాటి పొట్టును కలిగి ఉంటాయి. దీని వల్ల సూక్ష్మపోషకాలు నిల్వ ఉంటాయి. ఇందులో ఎక్కువగా కాల్షియం ఉంటుంది. తెల్ల నువ్వుల కంటే నల్ల నువ్వుల లడ్డూ, చిక్కీ తినడం వల్ల ఎముకలు స్ట్రాంగ్‌గా ఉంటాయి. నల్ల నువ్వుల్లో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. గుండె సంబంధిత సమస్యలు దరిచేరవు.