ఎర్రచందనంపై కేంద్రం ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఎర్రచందనం సాగును సంక్లిష్ట వాణిజ్య ప్రక్రియ సమీక్ష నుంచి తొలగించినట్లు కేంద్ర అటవీశాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ప్రకటించారు. ఇక నుంచి రైతులు ఎర్రచందనం సాగు చేసి, ఎగుమతి చేసుకోవచ్చని, ప్రోత్సాహకాలు కూడా ఇస్తామని కేంద్రమంత్రి తెలిపారు. ఇది రైతులకు ఎంతో మేలు చేసే నిర్ణయం అని చెప్పారు. దేశంలో ఏపీలోని చిత్తూర్ జిల్లాలో మాత్రమే ఈ అరుదైన ఎర్రచందనం పండుతుంది.