కళ్లకు సోకే వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇటీవల కాలంలో చాలా మంది ప్రజల కళ్లు ఎర్రబడటం చూస్తుంటామన్నారు. దానికి కారణం కళ్లల్లో దుమ్ము, ధూళి పడటమేనని అంటున్నారు. అలాగే ఎక్కువ సేపు టీవీ, మొబైల్ ఫోన్లు చూడటం వల్ల కళ్లు ఎర్రబడతాయని అంటున్నారు. కళ్లు ఎర్రబడినప్పుడు.. ముందుగా కళ్లను శుభ్రంగా కడుక్కోని ఐ డ్రాప్స్ వేసుకోవాలని సూచించారు. కళ్లను నేరుగా రబ్ చేయకూడదన్నారు.