మనం సాధారణంగా ఏదైనా ఆహారం తినేప్పుడు నీళ్లు తాగడం సహజం. అయితే కొన్ని ఆహారపదార్థాలు తినేప్పుడు నీరు తాగకూడదని నిపుణులు చెబుతున్నారు. అరటిపండులో కరిగే ఫైబర్ అధికంగా ఉంటుంది. అరటిపండు తినేప్పుడు నీళ్లు ఎక్కువగా తాగితే కడుపులోని గ్యాస్ట్రిక్ జ్యూస్‌లు కరిగిపోతాయి. దీని కారణంగా జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని అరటిపండ్లు తినేప్పుడు నీళ్లు తాగొద్దని నిపుణులు సూచిస్తున్నారు.