వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్‌కు భారత్ -ఆస్ట్రేలియా జట్లు యుద్ధ పోరుకి సిద్ధంగా ఉన్నాయి. 45 రోజుల్లో 48 మ్యాచ్‌లు ఆడి.. చాంపియన్‌ను నిర్ణయించే తుది పోరుకు సమయం ఆసన్నమైంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్త్, ఆస్టఆస్ట్రేలియా మధ్య ప్రపంచకప్ 2023 ఫైనల్ ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానుంది. సొంతగడ్డపై అభిమానుల మద్దతుతో మూడో టైటిల్ పై భారత్ దృష్టి సారిస్తోంది.
ఫైనల్ మ్యాచ్ కోసం 2 గంటల అదనపు సమయం కేటాయించారు. అంటే వర్షం లేదా ఇతర కారణాల వల్ల మ్యాచ్‌కు అంతరాయం కలిగితే 120 నిమిషాల పాటు ఓవర్ల కోటాలో కోత ఉండదు. ఉదాహరణకు మ్యాచ్‌ను 6 గంటలకు నిలిపివేసి 8 గంటలకు పునఃప్రారంభిస్తే ఓవర్ల తగ్గింపు ఉండదు. అంటే 120 నిమిషాలు అదనంగా కేటాయిస్తారు. మరో వైపు ఫైనల్ మ్యాచ్ కోసం రిజర్వ్ డే కూడా ఉంది. ఆదివారం మ్యాచ్ నిర్వహించలేని పక్షంలో సోమవారం మ్యాచ్ కొనసాగుతుంది.
భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగే ఫైనల్ మ్యాచ్ టై అయితే విజేతను తేల్చేందుకు సూపర్ ఓవర్ నిర్వహిస్తారు. సూపర్ ఓవర్‌లోనూ టై అయితే మళ్లీ సూపర్ ఓవర్ నిర్వహిస్తారు. విజేత తేలేవరకూ సూపర్ ఓవర్లు నిర్వహిస్తూనే ఉంటారు. ఫైనల్ మ్యాచ్‌కు రిజర్వ్ డేను కేటాయించిన విషయం తెలిసిందే. ఆదివారం ఏదైనా కారణంతో మ్యాచ్ వాయిదా పడితే సోమవారం నిర్వహిస్తారు. రిజర్వ్ డే రోజున కూడా ఫలితం తేలకపోతే ఇరు జట్లను జూయింట్ విన్నర్స్‌గా ప్రకటిస్తారు.