AP: పల్నాడు జిల్లా రెంటచింత మండలం తుమృకోటలో కార్తీక స్నానానికి వెళ్లిన దంపతులు నీట మునిగి చనిపోవడం పండుగపూట గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. నీలా సత్యనారాయణ, పద్మావతి అనే దంపతులు శనివారం కార్తిక మాసం సందర్భంగా కృష్ణనదికి వెళ్లారు. అక్కడ ప్రమాదవశాత్తు నదిలో పడి ఇద్దరు మృతి చెందారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.