వైఎస్సార్ జిల్లా వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్, కో-కన్వీనర్లకు పోలీసులు 41ఏ నోటీసులు ఇచ్చారు. వైసీపీ సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ వివేకానందరెడ్డి, కో-కన్వీనర్లు సునీత, నిశాంత్, వరకుమార్ లకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. వివేకానందరెడ్డి, సునీత, వరకుమార్, నిశాంత్ ల ఇళ్లకు పోలీసులు నోటీసులు అంటించారు. నేడు పులివెందుల పోలీస్ స్టేషన్ లో విచారణకు రావాలని ఆ నోటీసుల్లో స్పష్టం చేశారు. వర్రా రవీంద్రారెడ్డి కేసులో ప్రశ్నించేందుకు విచారణకు రావాలని పేర్కొన్నారు. ప్రస్తుతం వైఎస్సార్ జిల్లా వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్, కో-కన్వీనర్లు పరారీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో, ఆ నలుగురి ఇళ్లకు నోటీసులు అంటించిన పోలీసులు... వారి కోసం గాలిస్తున్నారు.