చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే రామ్మూర్తి నాయుడు మరణంపై తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని శాసన సభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు చెప్పారు. ఆయన మృతి తెలుగుదేశం పార్టీకి, చంద్రగిరి నియోజకవర్గ ప్రజలకు తీరని లోటని స్పీకర్ పేర్కొన్నారు. రామ్మూర్తి నాయుడు 1994 నుంచి 1999 వరకూ చంద్రగిరి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ విశేష సేవలు అందించారని అయ్యన్న గుర్తు చేశారు.1994-1996 మధ్య తన సహచర శాసనసభ్యుడిగా రామ్మూర్తి పనిచేశారని, నియోజకవర్గానికి ఆయన విశిష్టమైన సేవలు మరవలేనివని స్పీకర్ అయ్యన్న కొనియాడారు. రామ్మూర్తి నాయుడు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు చెప్పారు. భగవంతుడు వారికి మనోధైర్యం ప్రసాదించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా దేవుడిని ప్రార్థించినట్లు స్పీకర్ చెప్పుకొచ్చారు. రామ్మూర్తి నాయుడి సేవలను తెలుగు ప్రజలు ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటారని స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆశాభావం వ్యక్తం చేశారు.