ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తమ్ముడు రామ్మూర్తినాయుడు మరణంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రామ్మూర్తినాయుడు అనారోగ్య సమస్యలతో మరణించారని తెలిసి తీవ్ర మనోవేదనకు గురయ్యానని తెలిపారు. సోదర వియోగంతో బాధపడుతున్న సీఎం చంద్రబాబుకు సానుభూతిని తెలియజేశారు. రామ్మూర్తినాయుడి కుమారుడు, సినీ హీరో నారా రోహిత్ కు, కుటుంబసభ్యులకు సంతాపాన్ని తెలియజేస్తున్నానని పవన్ చెప్పారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో ఉండటం వల్ల అంత్యక్రియలకు హాజరుకాలేకపోతున్నానని తెలిపారు. రామ్మూర్తి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని చెప్పారు.