ఏపీలో మరో ఆరు చోట్ల ఎయిర్ పోర్టులు కట్టాలని సర్కార్ ప్రతిపాదించింది. వీటి నిర్మాణానికి ఫీజిబిలిటీ స్టడీ కోసం రూ.1.92 కోట్ల నిధులను విడుదల చేసింది. కుప్పం, శ్రీకాకుళం, నాగార్జున సాగర్, తుని-అన్నవరం, తాడేపల్లిగూడెం, ఒంగోలులో విమానాశ్రయాలను నిర్మించాలని ఎన్టీయే కూటమి ప్రభుత్వం భావిస్తోంది. కుప్పంలో 1,501, సాగర్లో 1,670 ఎకరాలను, తాడేపల్లిగూడెంలో 1,123, శ్రీకాకుళంలో 1,383, తుని- అన్నవరంలో 787, ఒంగోలులో 657 ఎకరాలను గుర్తించారు.