ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ పిల్లి సంపద రూ.840 కోట్లు.. ఎలా సంపాదిస్తుందో తెలిస్తే అవాక్కే

international |  Suryaa Desk  | Published : Sat, Nov 16, 2024, 10:00 PM

ప్రపంచంలోనే అత్యంత ధనవంతమైన పిల్లి గురించి మీరు ఎప్పుడైనా విన్నారా. దాని మొత్తం సంపాదన ఏకంగా రూ.840 కోట్లు. పైగా దానికి సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ మామూలుగా ఉండదు. ఈ పిల్లి పేరు నాలా. దీనికి ఇన్‌స్టాలో 45 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారంటే దీని క్రేజ్‌ ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. అత్యంత ఎక్కువ సంఖ్యలో ఇన్‌స్టాలో ఫాలోవర్లు ఉన్న పిల్లిగా గిన్నిస్‌ రికార్డును కూడా ఈ నాలా సొంతం చేసుకుంది.


క్యాట్స్‌.కామ్‌ వెబ్‌సైట్‌ వెల్లడించిన వివరాల ప్రకారం ఈ నాలా పిల్లి నికర సంపద సుమారు 100 బిలియన్‌ డాలర్లు అంటే మన భారత కరెన్సీలో అక్షరాలా రూ.840 కోట్లు. అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన సియామీ టాబీ మిక్స్‌ క్యాట్‌. 2010లో వరిసిరి మేతచిట్టిఫాన్ అనే మహిళ.. స్థానికంగా ఉన్న జంతు సంరక్షణ కేంద్రం నుంచి ఈ పిల్లిని దత్తత తీసుకుంది. ఆ సమయంలో దాని వయసు కేవలం 5 నెలలే కావడం గమనార్హం. 2012లో వరిసిరి.. ఆ నాలా పిల్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను అందరితో షేర్‌ చేసుకునేందుకు ఇన్‌స్టాలో నాలా పేరుతో ఒక అకౌంట్‌ను క్రియేట్‌ చేసింది. ఆ తర్వాత కొద్దిరోజులకే దానికి ఫాలోవర్ల సంఖ్య అమాంతం పెరిగింది.


ఈ క్రమంలోనే ఆ నాలా పిల్లి ఇన్‌స్టాలో 4.5 మిలియన్ల మంది ఫాలోవర్లు చేరుకున్నారు. దీంతో అత్యంత ఎక్కువ ఫాలోవర్లు కలిగి ఉన్న జంతువుగా నాలా గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డును దక్కించుకుంది. ఇక ఈ నాలా పిల్లి అందమైన తలపాగా.. నీలికళ్లతో చూసేవారిని మంత్రముగ్ధులు చేస్తుంది. నాలా పిల్లికి ఉన్న భారీ ఫాలోయింగ్ కారణంగానే.. పెంపుడు జంతువుల విభాగంలో ఫోర్బ్స్ టాప్ ఇన్‌ఫ్లుయెన్సర్‌ల జాబితాలో పేరు దక్కించుకుంది. అంతేకాకుండా ఈ పిల్లి పేరు మీద "లివింగ్ యువర్ బెస్ట్ లైఫ్ అకార్డింగ్ టు నాలా క్యాట్' అనే ఈ-బుక్‌ను కూడా ఉంది.


ఇక "లవ్‌ నాలా" పేరుతో క్రియేట్ చేసిన వెబ్‌సైట్‌తో ప్రీమియం క్యాట్ ఫుడ్ బ్రాండ్‌ను కలిగి ఉంది. ఇక ఈ లవ్‌ నాలా బ్రాండ్‌ హస్బ్రో, రియల్ వెంచర్స్, సీడ్ క్యాంప్‌ల వంటి సంస్థల నుంచి వందల కోట్లను సంపాదిస్తోంది. మరోవైపు.. ఈ నాలా పిల్లి సంపాదనలో అధికం సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయన్స్‌, వివిధ రకాల ప్రొడక్ట్స్‌ యాడ్స్, బ్రాండ్‌ల ద్వారానే ఆర్జిస్తోంది. ఈ పిల్లికి ఇన్‌స్టాగ్రామ్‌తో పాటు, టిక్‌టాక్, యూట్యూబ్‌తో సహా ఇతర అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో అకౌంట్లు ఉన్నాయి.


ఈ సోషల్‌ మీడియా ఫ్లాట్‌ఫామ్‌ల సాయంతో జంతు సంరక్షణ పట్ల అవగాహన కల్పించడం, స్వచ్ఛంద సంస్థలకు నిధులు సేకరించడం వంటివి ఆ పిల్లిని పెంచుకుంటున్న వరిసిరి చేస్తున్నారు. నల తర్వాత ప్రపంచంలోని రెండవ అత్యంత సంపన్న పిల్లిగా ఒలివియా బెన్సన్ నిలిచింది. ఈ ఒలివియా బెన్సన్ పిల్లి నికర విలువ రూ. 813 కోట్లు. మూడో అత్యంత సంపన్న పిల్లిగా దివంగత జర్మన్ ఫ్యాషన్ డిజైనర్ కార్ల్ ఒట్టో లాగర్‌ఫెల్డ్‌కు చెందిన చౌపెట్టే నిలవగా.. దాని సంపద రూ.109 కోట్లు ఉంది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com