ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సైబర్ నేరగాళ్ల వలలో యూపీ మంత్రి

national |  Suryaa Desk  | Published : Sat, Nov 16, 2024, 08:59 PM

యూపీ మంత్రి నంద్ గోపాల్ గుప్తా సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకున్నారు. మంత్రి నుండి రూ. 2.8 కోట్లు సైబర్ నేరగాళ్లు కాజేశారు. మంత్రి కుమారుడిని అంటూ అకౌంటెంట్ రితేష్ శ్రీవాస్తవకు సైబర్ నేరగాళ్లు కాల్ చేశారు. 'నేను బిజినెస్ మీటింగ్ లో ఉన్నాను. నాకు అర్జెంటుగా డబ్బులు కావాలి, త్వరగా పంపండి' అని చెప్పడంతో అకౌంటెంట్ 3 ఖాతాల్లో డబ్బులు పంపాడు. తర్వాత ఆ ఖాతాలను చెక్ చేయగా అవి మంత్రి కొడుకువి కాదని తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com