కాకినాడ జిల్లాకు రెండు ఇసుక రేవులు కేటాయిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పర్యావరణ అనుమతులు పొందిన ఇసుక రేవులు కాకినాడ జిల్లాలో లేవు. దీంతో కాకినాడ జిల్లావాసులు ఇసుక కావాలంటే అంబేద్కర్ కోనసీమ జిల్లా, తూర్పుగోదావరి జిల్లాలోని రీచ్‌ల మీద ఆధారపడుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో కాకినాడ జిల్లాకు ఇసుక రీచ్‌లు కేటాయించాలంటూ స్థానిక కలెక్టర్ షాన్ మోహన్ ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు ఇసుక రీచ్‌లను కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. తూర్పు గోదావరి జిల్లాలోని కడియం మండలంలోని వేమగిరి, పెరవలి మండలంలోని తీపర్రు ఇసుక రీచ్‌లను కాకినాడ జిల్లాకు కేటాయించారు.
ప్రభుత్వం నిర్ణయంతో ఈ ఇసుక రీచ్‌ల నుంచి ఇసుకను తవ్వి కాకినాడ జిల్లాకు తరలించనున్నారు. కాకినాడ రూరల్, పెద్దాపురంతో పాటుగా గొల్లప్రోలు స్టాక్ యార్డులకు ఈ ఇసుకను తరలిస్తారు. అక్కడ ఇసుకను నిల్వ ఉంచుతారు. కాకినాడ జిల్లాలో ఇసుక అవసరమైన వారు వేమగిరి, తీపర్రు ఇసుక రీచ్‌ల నుంచి మాత్రమే కాకుండా ఈ స్టాక్ యార్డుల నుంచి కూడా ఇసుకను తీసుకెళ్లవచ్చు. అయితే స్టాక్ యార్డుల నుంచి ఇసుకను తీసుకెళ్లా్ల్సి వస్తే రవాణా, లోడింగ్, తవ్వకాల ఛార్జీలు భరించాల్సి ఉంటుంది. కాకినాడ, పెద్దాపురం స్టాక్ యార్డుల నుంచి ఒక టన్ను ఇసుక కోసం రూ.600, గొల్లప్రోలు నుంచి అయితే రూ.582 చెల్లించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. ఇక వేమగిరి, తీపర్రు ఇసుక రీచ్‌లతో పాటుగా కాకినాడ రూరల్, గొల్లప్రోలు, పెద్దాపురం స్టాక్ యార్డుల నిర్వహణ కోసం ఏజెన్సీలను ఖరారు చేయనున్నారు. ఇసుక రీచ్‌ల నిర్వహణకు ఏజెన్సీలను ఇప్పటికే ఖరారు చేయగా.. స్టాక్ యార్డుల నిర్వహణ కోసం ఈ నెల 22 నాటికి లైసెన్సులు ఖరారు చేస్తార
బాపట్ల జిల్లాలో రెండు కొత్త ఇసుక రీచ్‌లు
మరోవైపు బాపట్ల జిల్లాలోనూ కొత్తగా రెండు ఇసుక రేవులను గుర్తించారు. కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో కొల్లూరు మండలం గాజుల్లంక, జువ్వలపాలంలో ఇసుక రీచ్‌లను గుర్తించినట్లు కలెక్టర్ తెలిపారు. అయితే ఇసుక తవ్వకాలకు పర్యావరణ అనుమతుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని.. అనుమతులు వచ్చిన తర్వాత తవ్వకాలు ప్రారంభిస్తామన్నారు. ఇక ఉచితంగా ఇసుక తీసుకెళ్లటానికి మండల స్థాయి అధికారి అనుమతులు ఇవ్వాలనే ఆదేశాలను అమలు చేయనున్నట్లు చెప్పారు. అలాగే సచివాలయాల ద్వారా దరఖాస్తు చేసుకునే విధానంపైనా అవగాహన కల్పించనున్నట్లు చెప్పారు.