చండ్ర రాజేశ్వరరావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రజతోత్సవ సభలో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చండ్ర రాజేశ్వరరావు ఎందరిలోనో ఉద్యమ స్పూర్తిని నింపారన్నారు. దున్నే వారిదే భూమి అన్న నినాదంతో పోరాడారని గుర్తుచేశారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పని చేశారన్నారు.
లక్షలాది మంది ఎర్ర సైన్యాన్ని తయారు చేశారని తెలిపారు. చండ్ర రాజేశ్వరరావు ఒక లెజండ్రీ అంటూ కొనియాడారు. భారతదేశం ముక్కలు కాకుండా , దేశ సమైక్యత కోసం కృషి చేశారని తెలిపారు. చివరి రోజుల్లో ఆయన ఆరోగ్యం బాగా క్షీణించిందన్నారు. చనిపోవడానికి మెరుక్యూ ఇంజక్షన్ అడిగితే... కమిటీ అంగీకరించ లేదన్నారు. యన్టీఆర్ సీఎంగా ఉన్న సమయంలో కొండాపూర్‌లో ఐదు ఎకరాలు కేటాయించారని.. అక్కడ వృద్దుల ఆశ్రమం ఇప్పుడు నడుపుతున్నారని చెప్పారు. 145 మంది వృద్దులు ఇప్పుడు అక్కడ ఉన్నారన్నారు. మహిళలకు ఉచిత శిక్షణ కేంద్రం నడుపుతున్నారని చెప్పారు. సీఆర్ చారిటబుల్ ట్రస్ట్ తరపున అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారని నారాయణ పేర్కొన్నారు.