ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోదరుడు, మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు మృతికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంతాపం వ్యక్తం చేశారు. రామ్మార్తి నాయుడు అనారోగ్య సమస్యలతో మరణించారని తెలిసి తీవ్ర ఆవేదనకు గురైనట్లు ఉప ముఖ్యమంత్రి తెలిపారు.
ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు పవన్ చెప్పుకొచ్చారు. సోదర వియోగంతో బాధపడుతున్న సీఎం చంద్రబాబుకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మహరాష్ట్ర ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో ఉండటంతో అంత్యక్రియలకు హాజరు కాలేకపోతున్నానని డిప్యూటీ సీఎం పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. రామ్మూర్తి కుమారుడు, సినీ హీరో రోహిత్, కుటుంబ సభ్యులకు సంతాపం తెలుపుతున్నట్లు పవన్ కల్యాణ్ చెప్పారు.