నారా రామ్మూర్తి నాయుడు మృతిపట్ల మంత్రి నారా లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నాన్న నారా రామ్మూర్తి నాయుడు మృతి తీవ్ర విషాదాన్ని నింపిందన్నారు. ‘‘చిన్నాన్నతో చిన్ననాటి నా అనుబంధం కళ్ల ముందు కదిలి వచ్చిన కన్నీటితో నివాళులు అర్పిస్తున్నాను.
మౌనమునిలా మారిన చిన్నాన్న ఇన్నాళ్లూ మాకు కంటికి కనిపించే ధైర్యం. నేటి నుంచి చిరకాల జ్ఞాపకం. చిన్నాన్న ఆత్మకు శాంతి కలగాలని దేవుణ్ని ప్రార్థిస్తున్నాను. అంతులేని దుఃఖంలో ఉన్న తమ్ముళ్లు, పిన్ని దైర్యంగా ఉండాలని కోరుతున్నాను’’ అని మంత్రి లోకేష్ అన్నారు.మరోవైపు హిందూపురం ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ ఏఐజీ ఆస్పత్రికి చేరుకున్నారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా కాసేపటి క్రితమే ఢిల్లీ నుంచి బేగంపేట్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా ఏఐజీ ఆస్పత్రికి చంద్రబాబు రానున్నారు. ఏఐజీ ఆస్పత్రిలో ఉన్న నారా రామ్మూర్తి నాయుడు భౌతికకాయానికి మాజీమంత్రి మోత్కుపల్లి, తీగల కృష్ణారెడ్డి, సినీ నటుడు సుమన్, జీవిత నివాళులర్పించారు. అలాగే రామ్మూర్తి మృతిపట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేశారు.