కర్నూలు నుంచి న్యాయసంస్ధలు అమరావతికి తరలించే ప్రయత్నాన్ని విరమించుకోవాలి అని నంద్యాల జిల్లా వైసీపీ అధ్యక్షుడు కాటసాని రామ్‌భూపాల్ రెడ్డి డిమాండ్ చేసారు.
ఆయన మాట్లాడుతూ..... రాయలసీమకు అన్యాయం జరిగింది. వైయస్ జగన్ కర్నూలుకు జ్యూడిషియల్ క్యాపిటల్ ప్రకటించారు, కర్నూలు ప్రాంత ప్రజలు ఆలోచించాలి, నేషనల్ లా యూనివర్శిటీకి అత్యంత విలువైన భూములు ఇచ్చారు ఇక్కడి ప్రజలు, వీటిని ఇక్కడి నుంచి తరలిపోకుండా మేమంతా పోరాడతాం. ప్రజా ఉద్యమాలు చేస్తాం, రాయలసీమ కూటమి నాయకులు ఒక్కరు కూడా నోరు మెదపడం లేదు, మీలో చిత్తశుద్ది ఉంటే ఈ తరలింపును అడ్డుకోండి. న్యాయ సంస్ధలను ఎట్టి పరిస్ధితుల్లో ఇక్కడి నుంచి తరలించడానికి వీల్లేదు అని డిమాండ్ చేసారు.