ఫైబర్ ఎక్కువగా ఉండే పండ్లు తింటే షుగర్ కంట్రోల్‌లో ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. శీతాకాలంలో రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడానికి కొన్ని రకాల పండ్లు ఉపయోగపడతాయి. నారింజ పండ్లలో ఫైబర్, విటమిన్-సీ పుష్కలంగా ఉంటాయి. ఇది మధుమేహ రోగుల్లో చక్కెర స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది. కివీస్, ఆపిల్స్, బెర్రీలు, బేరిపండు కూడా ఆరోగ్యానికి మంచివి. వీటిని తినడం వల్ల కూడా రక్తంలో షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి.