బీన్స్ లో కాపర్, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్, ప్రొటీన్, క్యాల్షియం వంటి పోషకాలు ఉంటాయి. వీటిని తింటే గొంతు, కడుపు నొప్పి, వాపు తగ్గుతాయి. బీన్స్‌లో ఉండే మెగ్నీషియం గుండె సంబంధిత వ్యాధులను తగ్గిస్తుంది. బీన్స్ తింటే ఎనర్జీ లెవెల్ మెరుగ్గా ఉంటాయి. ఐరన్ లోపం కూడా ఏర్పడకుండా కాపాడుతుంది. బీన్స్‌లో విటమిన్ బీ6, థయామిన్, పాంతోథేనిక్ యాసిడ్, నియాసిన్ వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తాన్ని శుభ్రపరచడంలో ముఖ్య పాత్ర పోషించే మూలకాలను కలిగి ఉంటాయి. బీన్స్ తింటే శరీరం బరువు సులభంగా అదుపులో ఉంటుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది.