ఉసిరి పండు మానవ శరీరానికి మంచి ఆరోగ్యాన్ని అందిస్తుంది. ఉసిరికాయలోని ఫైబర్ ప్రేగు కదలికలను మెరుగుపరుస్తుంది. ఉసిరికాయలోని ఫ్లేవనాయిడ్స్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని హానికరమైన ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి ఒత్తిడిని తగ్గిస్తాయి. ఇది తెల్ల రక్త కణాల సంఖ్యను పెంచుతుంది. ఉసిరి జలుబు, దగ్గు వంటి సీజనల్ వ్యాధులను నివారిస్తుంది. ఇది చర్మం, చుండ్రు సమస్యలను తగ్గిస్తుందని కొందరు నిపుణులు పేర్కొంటున్నారు.