టీడీపీ అధినేత చంద్రబాబు కేసుల విషయంలో నేడు రెండు కీలక తీర్పులు రానున్నాయి. ఇప్పటికే స్కిల్ స్కాం కేసులో ఆయనకు ఏపీ హైకోర్టు రెగ్యులర్ బెయిల్ ను మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే బుధవారం మరో రెండు కీలక కేసులపై విచారణ జరగనుంది. ఇసుక స్కాం, మద్యం కేసులో దాఖలైన పిటిషన్ పై నేడు ధర్మాసనం విచారణ చేపట్టనుంది. దీంతో కోర్టు ఎలాంటి తీర్పునిస్తుందోనని తీవ్ర ఉత్కంఠ నెలకొంది.