టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై బుధవారం ఏపీ హైకోర్టులో మధ్యాహ్నం 2 గంటలకు విచారణ జరగనుంది. మద్యం కంపెనీల అనుమతుల విషయంలో అక్రమాలకు పాల్పడ్డారంటూ టీడీపీ అధినేత చంద్రబాబుతోపాటు మరికొందరిపై ఏపీ సీఐడీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో చంద్రబాబును ఏ3గా, కొల్లు రవీంద్రను ఏ2 గా చేర్చింది.