గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీలో సెర్ఫ్ పరిధిలో పనిచేస్తున్న 4,569 మంది హెచ్ఐర్ ఉద్యోగులకు బేసిక్ వేతనంపై 23 శాతం పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ఆగస్టులోనే జీతాల పెంపుపై ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం తాజాగా గెజిట్ లో చేర్చింది.