చాలా మంది ఆహారపదార్థాలను పదే పదే వేడి చేసి తింటుంటారు. ఇలా తినడం మంచిదా? కాదా?. నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం. కొందరు అన్నాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టిన తర్వాత అరకొర వేడి చేసి తింటుంటారు. అలా చేయకూడదు. బియ్యంలో బ్యాక్టీరియా ఉంటుంది. అది వేడి చేసినప్పుడు వృద్ధి చెందుతుంది. అందుచేత అన్నాన్ని ఎక్కువ సేపు వేడి చేయాలి. అలాగే గుడ్డు రబ్బరులా సాగుతుంటే దాన్ని మళ్లీ వేడి చేయకూడదు. తాజా కూరగాయలను వండినప్పుడే కొన్ని పోషకాలు కోల్పోతాయి. వాటిని మరోసారి వేడి చేసి తిన్నా ప్రయోజనం ఉండదు.
పాలను ఎక్కువ సార్లు వేడి చేస్తే వాటిలోని సాల్యుబుల్ విటమిన్లతో పాటు పోషకాలు తగ్గుతాయి. అప్పుడు వాటిని తాగిన ఫలితం ఉండడు. కాబట్టి ఎన్ని అవసరం అవుతాయో అంత మాత్రమే కాచుకుని తాగాలి. మాంసాన్ని వేడిచేసేపట్టుడు ముక్కల మధ్య భాగం వేడెక్కేలా చేయాలి. ఏ పదార్థాన్నైనా వేడి చేసుకుని తినడం ద్వారా ఆరోగ్య సమస్యలు వస్తాయి. అవసరం మేరకు వండుకుని తినడం మేలు అంటున్నారు నిపుణులు.