బాపట్ల మండలంలోని పూండ్లలో అనుమతి లేకుండా రక్షిత నీటి పథకం పైప్లాన్ నుంచి కుళాయి కనెక్షన్ తీసు కోవద్దని చెప్పినందుకు సర్పంచి నన్నం నరసింహారావుపై స్థానిక ఆర్ఎంపీ ఉద య్కుమార్ భార్య, కుమారుడితో కలిసి మంగళవారం దాడి చేశారు. కనెక్షన్ కోసం అనవసరంగా రోడ్డు తవ్వద్దని చెప్పినందుకు తనపై దాడి చేశారని బాపట్ల గ్రామీణ పోలీసులకు సర్పంచి ఫిర్యాదు చేశాడు. ఆర్ఎంపీ సహా కుటుంబసభ్యులతో కలిపి ముగ్గురిపై పోలీసులు కేసు నమోదుచేశారు.