ఆవాలలో మినరల్స్, కాల్షియం, పొటాషియం, మెగ్నిషియం, పాస్ఫరస్ తదితర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి వ్యాధులు రాకుండా కాపాడి వ్యాధి నిరోధకతను పెంచుతాయి. శ్వాసకోశ సమస్యలు, నొప్పులు, జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ఆవాలలో ఉండే ఫైబర్ జీర్ణ ప్రక్రియను మెరుగుపరుస్తుంది. చర్మ సమస్యలు, సోరియాసిస్ ను కట్టడి చేయడంలో ఆవాలు అద్భుతంగా పని చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.