బరువు తగ్గాలనుకునేవారు ఓట్స్ తినడం మంచిది. వీటిలో ఫైబర్, కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి త్వరగా అరగకపోవడంతో ఆకలి వేయదు. దీంతో త్వరగా బరువు తగ్గుతారు. ఫైబర్ చెడు కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయులను నిలకడగా ఉంచుతుంది. ఓట్స్ లోని మినరల్స్ ఎముకల ఆరోగ్యానికి సాయపడతాయి. ఓట్స్ తింటే కడుపుబ్బరం, మలబద్ధకం లాంటి సమస్యలు పోతాయి.