చాలా మందికి పని ఒత్తిడి, ఆందోళన వల్ల సరిగా ఆకలి వేయదు. మరికొందరికి అనారోగ్యంచేత ఆకలి సరిగా అనిపించదు. అటువంటివారు రోజూ 4 ఖర్జూరాలను తింటే బాగా ఆకలి వేస్తుంది. నిమ్మరసం తాగితే జీర్ణవ్యవస్థ మెరుగై ఆకలి కలిగేలా చేస్తుంది. రోజూ అల్లం ముక్కల్ని దవడన పెట్టుకుని నమిలితే ఆకలి వేస్తుంది. భోజనం తర్వాత ద్రాక్ష పండ్లను తింటే జీర్ణం బాగా అయ్యి ఆకలి వేయడానికి ఉపకరిస్తుంది.