అష్టాదశ శక్తి పీఠాలలో గిరిజా దేవి శక్తి పీఠం ఒకటి. ఒరిస్సా రాష్ట్రం కటక్ సమీపంలోని వైతరణీ నది ఒడ్డున గిరిజా దేవి అమ్మవారు త్రిశక్తి స్వరూపిణిగా వెలసింది. ఈ ప్రాంతాన్ని వైతరణీ పురం అని కూడా అంటారు. ఒరిస్సాలోని జాజిపూర్ రోడ్ నుంచి 20 కి.మీ దూరం ప్రయాణిస్తే ఈ గిరిజా దేవి ఆలయం ఉంది. సతీదేవి ‘నాభి స్థానం’ ఇక్కడ పడిందని అంటారు. స్థానికులు గిరిజా దేవి అమ్మవారిని భిరిజా దేవిగా పిలుస్తారు.