పామాయిల్‌లో సంతృప్త కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. ఇవి మనలో చెడు కొలెస్ట్రాల్‌ని పెంచడంలో కీలకంగా పని చేస్తాయి. దీంతో గుండె జబ్బులు, రక్తపోటు లాంటివి వచ్చే అవకాశాలు పెరిగిపోతాయి. వంద గ్రాముల పామాయిల్‌ని తింటే మనకు ఏకంగా 884 క్యాలరీలు లభిస్తాయి.
దీంతో బరువు పెరగడం, ఊబకాయం రావడం, ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తడం లాంటి దుష్పరిణామాలు చోటు చేసుకుంటాయి. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం, మధుమేహం ముప్పుల్లాంటివీ ఎక్కువ అవుతాయి.