రేగు పండ్లను తరచూ తినడం వల్ల సీజనల్‌గా వచ్చే వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. దగ్గు, జలుబు, జ్వరం వంటివి తగ్గిపోతాయి. ఈ పండ్లలో ఉండే యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలు వ్యాధులను రాకుండా చూస్తాయి. రేగు పండ్లను తినడం వల్ల సన్నగా ఉన్నవారు బరువు పెరగవచ్చు. రేగు పండ్లను తరచూ తినడం వల్ల లివర్ ఆరోగ్యం మెరుగు పడుతుంది. రేగు పండ్లను తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.