పండ్లు వాడుతున్నాం అన్నది కాదు ఎలా వాడుతున్నారో అదే ముఖ్యం. కొన్ని పండ్లు జ్యూస్ గా తీసుకొనే కంటే నేరుగా పండ్లుగానే తీసుకోవడం ఉత్తమం. అలాంటి జాబితాలో కమల పండు కూడా ఉంది మరి. కమల పండ్లు కూడా హైబీపీని నార్మల్‌గా ఉంచడానికి సహాయపడతాయి. ఇందులో అమినో యాసిడ్స్, ఫైబర్, కాల్షియం, అయోడిన్, ఫాస్పరస్, సోడియం, మినరల్స్, విటమిన్ ఎ, బి పుష్కలంగా ఉంటాయి. ఇవి హైబీపీని కంట్రోల్ చేయడానికి సహాయపడతాయి. కమల పండులోని పోషకాలు.. మీ శరీరానికి అందాలంటే.. జ్యూస్‌కు బదులుగా పండు తినడం మంచిది. మీరు టేస్టీ..టేస్టీగా మీ బీపీని కంట్రోల్‌లో ఉంచుకోవచ్చు.