వేపాకుతో ఎన్నో సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ఎర్రగా మారిన చర్మాన్ని నయం చేయడానికి వేప చక్కగా పనిచేస్తుంది. చుండ్రు సమస్యలు, జుట్టు సమస్యలు, ఇన్ఫెక్షన్లు తగ్గేలా చేస్తుంది. దురదలు, మంటలు వంటి చర్మ సమస్యలను తగ్గించడానికి వేపాకు పేస్ట్ రాసుకోవడం మంచిదని ఆయుర్వేద నిపుణులు సూచిస్తుంటారు. అలాగే ముడతలు, మొటిమలను నయం చేయడానికి సహాయపడుతుంది.