వచ్చే ఏడాది మార్చిలో జరిగే ఇంటర్ మొదటి, రెండో ఏడాది జనరల్, ఒకేషనల్ పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపునకు ఏపీ ఇంటర్ విద్యా మండలి ఈనెల 5 వరకు గడువు పొడిగించింది. వాస్తవానికి నవంబర్ 30తో గడువు ముగిసింది. అయితే, ఈ గడువును మరో ఐదురోజులు పొడిగిస్తూ ఇంటర్మీడియట్ విద్యా మండలి ఉత్తర్వులిచ్చింది. రూ.1000 ఆలస్య రుసుంతో 15 వరకు చెల్లింపునకు అవకాశం కల్పించినట్లు ప్రకటించారు.