దానిమ్మ పండులో మంచి పోషకాలు ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. దానిమ్మలో విటమిన్ సి,ఇ,కె, మెగ్నిషియం వంటి ఖనిజాలు ఉండటం వల్ల మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది. దానిమ్మ గింజలను తింటే మనకు ఆరోగ్యం మెరుగుపడుతుంది. దానిమ్మలో యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్, నరాలు, కండరాలు బాగా పనిచేసేందుకు సహకరిస్తాయి. నరాల బలహీనతను తగ్గిస్తాయి. మెగ్నిషియం నరాలు, కండరాల ఆరోగ్యం బాగుండేలా చేస్తాయి.