ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యాలుకల తో చెడు కొలెస్ట్రాల్ సమస్యకు చెక్!

Life style |  Suryaa Desk  | Published : Tue, Dec 05, 2023, 11:54 AM

బరువు తగ్గాలనుకునే వారు రోజూ రాత్రి ఒక యాలుకను తిని లేక గ్లాసు వేడినీళ్లు తాగితే శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఫలితంగా తక్కువ బరువు మరియు చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఇలా చేయడం వల్ల బరువు తగ్గడమే కాకుండా శరీరంలోని హానికరమైన మలినాలు, వ్యర్థాలు కూడా తొలగిపోతాయి. అంతేకాకుండా రక్త ప్రసరణ బాగా మెరుగుపడుతుంది. గ్యాస్ సమస్యను నివారిస్తుంది. మలబద్ధకం సమస్య నుండి బయటపడండి. నిద్రలేమి సమస్య తగ్గుతుంది. నిద్రలో గురకను తగ్గిస్తుంది.
యాలుకలు శృంగార జీవితంలో ఏర్పడే అపశృతులను తొలగిస్తాయి. అంతేకాకుండా వీర్యంలో శుక్రకణాల వృద్ధికి తోడ్పడుతాయి. శృంగార జీవితానికి యాలుకలు ఒక శక్తివంతమైన టానిక్ అని చెప్పవచ్చు. చర్మసౌందర్యానికి కూడా యాలుకలు ఉపయోగపడతాయి. చర్మంపై ఏర్పడ్డ నల్లమచ్చలను తగ్గించి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. జుట్టు చిట్లడం, ఊడిపోవడం వంటి సమస్యలను తగ్గించి వెంట్రుకలను కుదుళ్ల నుండి బలోపేతం చేసి ఆరోగ్యవంతమైన జుట్టు పెరిగేలా దోహదపడుతుంది. ఇలా అనేక ప్రయోజనాలను కలిగిన యాలుకలను ఆహారంలో తీసుకుంటే మేలు కలుగుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com