చలికాలంలో కాలీఫ్లవర్ ఎక్కువగా దొరుకుతుంది. కాలీఫ్లవర్‌తో వివిధ రకాల వంటకాలు తయారు చేసుకుని చాలా మంది ఇష్టం తింటారు. కాలీఫ్లవర్‌లోని పోషకాలు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి.విటమిన్ సి తో పాటు, ఫోలేట్, విటమిన్ B6, పొటాషియం, మాంగనీస్ వంటి మినరల్స్ ఇందులో పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా ఉన్నాయి. కానీ కాలీఫ్లవర్‌లో ఎన్ని పోషకాలు ఉన్నా, దీనిని అతిగా తినడం వల్ల కొన్ని ప్రతికూలతలు కూడా ఎదుర్కోవలసి వస్తుంది. పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం..కాలీఫ్లవర్ తినడం వల్ల కలిగే అనర్థాలను తెలుసుకునే ముందు, దాని వల్ల శరీరానికి కలిగే ప్రయోజనాలను ముందుగా తెలుసుకుందాం. కాలీఫ్లవర్‌లో ఇండోల్-3 కార్బినాల్, సల్ఫోరాఫేన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కాలీఫ్లవర్‌లో ఫైబర్, పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది కొలెస్ట్రాల్ స్థాయిని, బీపీని అదుపులో ఉంచుతుంది. దీనిలో ఫైబర్ ఉన్నందున, జీర్ణవ్యవస్థ సజావుగా ఉంటుంది. తద్వారా మలబద్ధకం నుంచి ఉపశమనం పొందవచ్చు.