శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచడంలో క్యారెట్ సహాయపడుతుంది. వీటిలో బీటా కెరోటిన్ అధిక స్థాయిలో ఉంటుంది. క్యారెట్ గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. క్యారెట్‌లో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు మరియు కాల్షియం పుష్కలంగా ఉంటాయి. క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. క్యారెట్‌లో ఉండే విటమిన్లు జుట్టు పొడిబారకుండా చేస్తుంది. క్యారెట్ జీర్ణక్రియ మరియు మలబద్ధకం సమస్యలను తొలగిస్తుంది.