మనిషికి తిండి, నీరు ఎంత అవసరమో నిద్ర కూడా అంతే ముఖ్యం. అయితే పడుకునే ముందు కొన్ని అలవాట్ల కారణంగా నిద్ర డిస్టర్బ్ అవుతుంది. నిద్రపోయే ముందు ఫోన్‌ని ఉపయోగిస్తే, ఫ్లోరోసెంట్, LED నుంచి వెలువడే బ్లూ లైట్ నిద్రకు ఆటంకం కలిగిస్తాయి. అలాగే రాత్రిపూట వ్యాయామం చేయడం వల్ల శరీరంలో ఒత్తిడి హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి. ఇవి నిద్రను డిస్టర్బ్ చేస్తాయి. అతిగా పనిచేయడం కూడా నిద్రను డిస్టర్బ్ చేస్తుంది.