దొండకాయ తింటే శరీరానికి కావాల్సిన ఎన్నో పోషకాలు అందుతాయని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. షుగర్ పేషెంట్స్ దొండకాయ తింటే రక్తంలో చక్కెర స్థాయి తగ్గుతుంది. దీనిలోని థయామిన్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. రక్తహీనతను దూరం చేస్తుంది. దొండకాయలో స్థూలకాయాన్ని నిరోధించే గుణాలున్నాయని దీన్ని తింటే బరువు తగ్గే అవకాశాలున్నాయంటున్నారు. కంటి ఆరోగ్యాన్ని సైతం మెరుగు పరుస్తుందంటున్నారు.