మహిళల్లో ఐరన్ లోపం ఎక్కువగా ఉంటుంది. నెలనెలా నెలసరి సమయంలో మహిళల శరీరం నుంచి ఎక్కువ మొత్తంలో రక్తం బయటకు వెళ్తుంది. దీని కారణంగా వారిలో ఐరన్ లోపం ఎక్కువగా ఉంటుంది. మహిళలు పీరియడ్స్ సమయంలో 30 %, ప్రెగ్నెన్సీ సమయంలో 42 % ఐరన్ లోపంతో బాధపడుతున్నారని నిపుణులు చెబుతున్నారు.
ఐరన్‌లో లోపం కారణంగా.. నెలసరి సమయంలో ఎక్కువ రక్తస్రావం అవ్వడం, తల తిరగడం, విపరీతమైన అలసట, శ్వాస ఆడకపోవడం, గోళ్లు పెళుసుగా మారడం, నీరసం, అలసం వంటి సమస్యలు ఎదురవుతాయి. మహిళలు ఐరన్ లోపం దూరం చేసుకోవడానికి.. మాంసం, చేపలు, ఆకుకూరలు, డ్రైఫ్రూట్స్, బీన్స్, పప్పుధాన్యాలు, సోయా, టొమాటో, బంగాళాదుంపలు, పుట్టగొడుగులు, ఖర్జూరం, బఠాణీలు, సీజనల్ పండ్లు వారి డైట్‌లో చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.